ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి( Cannabis ) సాగులో ముందుందని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాయి.నిన్న జనసేన ఆవిర్భావ పదవ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఈ విషయంపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా దొరుకుతుందని యువత పాడైపోతుందని ఆరోపణలు చేయడం జరిగింది.విద్యార్థుల సైతం గంజాయి తీసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి తాగి చాలామంది యువకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గంజాయి బ్యాచ్.బ్లేడ్ బ్యాచ్ రాజమహేంద్రవరంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు కూడా వార్తలు విన్నాం.ఈ రకంగా గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( Andhra Pradesh ) విచ్చలవిడిగా ఉన్నట్లు ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఏపీ నుండి మహారాష్ట్ర వెళ్తున్న గంజాయితో కూడిన భారీ కంటైనర్ నీ పట్టుకోవడం జరిగింది.ముందస్తు సమాచారంతో హయత్ నగర్ వద్ద పక్కా ప్రణాళికతో కంటైనర్ ని పట్టుకున్నారు.
ఈ భారీ కంటైనర్ లో వేలాది కిలోల గంజాయి ఉండటంతో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది.







