కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రభు వంటి సెలబ్రిటీలు పి వాసు దర్శకత్వంలో నటించిన చిత్రం చంద్రముఖి( Chandramukhi ).ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రస్తుతం చంద్రముఖి 2సినిమా( Chandramukhi2 ) షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.అయితే ఈ సినిమాకి పి వాసు దర్శకత్వం వహించినప్పటికీ రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్( Raghava Lawrence ) నటించిన జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కంగనా తాజా అప్డేట్ ఇచ్చారు.

తాజాగా ఈమె రాఘవ లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని తెలియజేశారు.ఇలా తన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందాన్ని వదిలి వెళ్ళడం తనకు చాలా కష్టంగా ఉందని ఈమె తెలియజేశారు.ఎంతో అద్భుతమైన టీం నాకు దొరికింది ఇక లారెన్స్ సర్ తో నా ఫోటోలు ఏమీ లేకపోవడంతో ఈరోజు షూటింగ్ పూర్తి కాగానే లారెన్స్ మాస్టర్ గారితో కలిసి ఫోటో దిగానని ఈమె తెలియజేశారు.
ఆయన కెరీర్‌ను కొరియోగ్రాఫర్‌గా మొదలుపెట్టి.బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.అన్నింటికి మించి ఆయన చాలా మంచి వ్యక్తి.గొప్పమనసున్న వ్యక్తి ఎల్లప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటారు… ఇలాంటి వ్యక్తితో పని చేయడం సంతోషంగా ఉంది అంటూ ఈమె చెప్పుకొచ్చారు.

ఇలా చంద్రముఖి సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ కంగనా ( Kangana )చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇకపోతే ఈ మధ్యకాలంలో కంగనా బాలీవుడ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదని కోలీవుడ్ సినిమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించిన సినిమాలు కూడా ఎన్నో అంచనాల నడుమ విడుదల అవుతున్నప్పటికీ డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.మరి చంద్రముఖి 2 సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.







