హన్మకొండ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు.రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు.
జానకీపురం సర్పంచ్ తనకు బిడ్డతో సమానమని తెలిపారు.తనకు ఇప్పుడు 63 ఏళ్లన్న ఆయన ఈ వయసులో తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకలలో పాల్గొన్న ఆయన బోరున విలపించారు.అయితే ఇటీవల జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.