కర్నూలు జిల్లాలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.కర్నూలు నగరంలో తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారని తెలుస్తోంది.
చెన్నమ్మ సర్కిల్ వద్ద తల్లీ, కూతురుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని సమాచారం.
ఈ క్రమంలోనే దుండగులకు అడ్డువచ్చిన ఇంటి యజమానిపై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతులు రుక్మిణీదేవి, రమాదేవిగా గుర్తించారు.