ప్రభుత్వ ఉద్యోగులలో చాలా మంది నిజాయతీపరులు ఉంటారు.తమ ముందు ఎంత పెద్ద వారున్నా, నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పట్టుబడతారు.
ఇదే కోవలో ఓ ట్రైన్ టికెట్ ఎగ్జామినర్(TTE) వ్యవహార శైలిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.టికెట్ లేకుండా ట్రైన్‌లో ప్రయాణిస్తున్న పోలీసులకు అతడు చుక్కలు చూపించాడు.
తన ముందు ఉన్నది పోలీసులు అయితే తనకేంటని, టికెట్ లేకుంటే పక్కకు వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసులతో టీటీఈ గొడవ పడుతున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో ఒక వర్ధమాన జర్నలిస్ట్ పంచుకున్నారు, దీనిలో కొంతమంది పోలీసులు (Police) రైలులోనే యూనిఫాంలో కనిపించారు.వీడియో ట్వీట్ ప్రకారం, ఈ సంఘటన అమర్నాథ్ ఎక్స్‌ప్రెస్‌లో(Amarnath Express) జరిగింది.ఆ పోలీసులు టికెట్ కొనుగోలు చేయలేదు.పైగా ప్రయాణికుల సీట్లలో ఆక్రమించుకుని కూర్చున్నారు.ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారు.అలాంటి సమయంలో ఓ టీటీఈ అక్కడకు వచ్చాడు.
ఆ పోలీసులను టికెట్ ఏదని అడిగాడు.

దీంతో తాము పోలీసులమని, టికెట్ కొనుగోలు చేయకుండానే ప్రయాణిస్తున్నట్లు చాలా దబాయిస్తూ వారు చెప్పారు.తమను టికెట్ అడగొద్దని రుబాబు చేశారు.అయితే టీటీఈ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
టికెట్ లేకుండా ప్రయాణించడానికి ఈ రైలు ఎవరి సొత్తూ కాదని స్పష్టం చేశాడు.టికెట్ లేకుండా ప్రయాణించడం కుదరదని, ట్రైన్ దిగిపోవాలని స్పష్టం చేశాడు.
కాసేపు వాదించిన పోలీసులు చివరికి తోక ముడిచారు.టీటీఈ చెప్పినట్లే ట్రైన్ నుంచి దిగిపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.టీటీఈ ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.







