Shruti Haasan : సిస్టర్ తో తీన్మార్ స్టెప్ లేస్తున్న శృతిహాసన్.. ఎక్స్‌ప్రెషన్స్ మామూలుగా లేవుగా?

కొందరు సెలెబ్రెటీలు కాస్త సమయం దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో గడుపుతూ ఉంటారు.వారితో కలిసి ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 Shruti Haasan Steps Up With Sister-TeluguStop.com

ఇక ఫ్యామిలీతో గడిపిన సందర్భాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా శృతిహాసన్(Shruti Haasan) కూడా తన సిస్టర్ తో సరదాగా గడిపినట్లు కనిపించింది.

ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది.

తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan)హోదాతో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.అందం పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.ఇప్పటికీ వరుస సినిమాలతో బాగా దూసుకుపోతుంది.

తొలిసారిగా బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీకి పరిచయమైంది శృతిహాసన్.ఇక తెలుగు ప్రేక్షకులకు అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది.

గతంలో ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారాలలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

వాటి వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది.మళ్లీ తను లైఫ్ లోకి శాంతా ను హజారికా(Santa Nu Hazarika) అనే ఓ వ్యక్తి రావటంతో మరోసారి తన లైఫ్ ను కొత్తగా మొదలుపెట్టింది.ప్రస్తుతం అతడితో సహజీవనం చేస్తుంది.

అంతేకాకుండా ఆ మధ్యనే రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బాగా దూసుకుపోతుంది.ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ సందడి చేస్తుంది.చాలావరకు తన బాయ్ ఫ్రెండ్ తో గడిపిన సందర్భాలను బాగా షేర్ చేస్తుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.ఇక ఎక్కడికి వెళ్లినంత బాయ్ ఫ్రెండ్ ను వెంట పట్టుకొని వెళ్తూ పబ్లిక్ ప్లేస్ లలో కూడా బాగా రచ్చ చేస్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.అందులో తన సిస్టర్ అక్షర హాసన్ తో కలిసి ఒక మాస్ మ్యూజిక్ కు తీన్మార్ స్టెప్పులు వేస్తూ కనిపించింది.అందులో తన సిస్టర్ కూడా తన స్టెప్పులతో బాగా ఫిదా చేసింది.ఇక శృతిహాసన్ చీర కట్టుకొని ఉన్న కూడా ఆ స్టెప్పులతో బాగా హ్యాండిల్ చేసింది.

అంతేకాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా మామూలుగా ఇవ్వలేదని చెప్పాలి.ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.

ఇక శృతిహాసన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులో బిజీగా ఉంది.

https://instagram.com/stories/shrutzhaasan/3057661773881666414?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube