ముగ్గురు ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలు అందజేసిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరి లక్ష్మి – నర్సయ్య ల కూతురు రచన వివాహాము తేదీ 15-3-2023 రోజున ఉన్నందున ఈ పెండ్లికి తనవంతు సహాయంగా పుస్తె మట్టెలు, గాజులు, పట్టు చీరలు ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.
బండలింగంపల్లి బీజేపీ గ్రామ శాఖ తరుపున 5016/ రూపాయలు పెళ్లి కూతురికి అందజేశారు.ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుండడి వెంకట్ రెడ్డి, మండల కోశాధికారి కొత్తపల్లి ఆంజనేయులు , బైరగొని బాలగౌడ్ , వంగ శ్రీకాంత్ రెడ్డి బొడ్డురాజు, సాయి కుమార్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డీ ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







