దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నాని మాత్రమే కనిపిస్తున్నాడు.పోస్టర్స్ మరియు వీడియోల్లో మాత్రమే హీరోయిన్ కనిపిస్తోంది.
నాని(Nani) మాత్రమే ఎందుకు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.ఆమె ఎందుకు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా దసరా సినిమాని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నాని ఉత్తర భారతంలో పర్యటిస్తున్నారు.ప్రస్తుతం దసరా సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయడం కోసం ముంబై(Mumbai) లో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా దసరా సినిమా తో మంచి పాపులారిటీని కీర్తి సురేష్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.కానీ ఆమె మాత్రం ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో పెద్దగా శ్రద్ద పెడుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ నాని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో మాదిరిగా కీర్తి సురేష్ (Keerthy Suresh)తన ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సినిమా సక్సెస్ అయితేనే ఆమె కెరీర్ లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.కనుక దసరా సినిమా కోసం నానితో పాటు ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆమె ప్రస్తుతం తమిళనాడులో ఉంది.
ట్రైలర్ విడుదల కార్యక్రమం కోసం ముంబయి వస్తుందా అనేది చూడాల్సి ఉంది.ఈ సినిమా లో నాని మరియు కీర్తి సురేష్ లు ఢీ గ్లామర్ రోల్ లో కనిపించబోతున్నారు.
సింగరేణి బొగ్గు గని సమీపంలో ఉండే చిన్న గ్రామానికి చెందిన యువకుడి యొక్క కథ తో ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది.నాని ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అంచనాలు ఆకాశానికి పెరిగిన విషయం తెల్సిందే.
ఈనెల 30న విడుదల కాబోతున్న దసరా ఎలా ఉంటుందో చూడాలి.







