టాలీవుడ్ పాపులర్ సింగర్లలో రాహుల్ సిప్లిగంజ్(rahul sipliguj) ఒకరు.అయితే రాహుల్ సిప్లిగంజ్ టాలెంట్ కు తగిన గుర్తింపు ఇప్పటివరకు దక్కాలని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆస్కార్ అవార్డ్ ( Oscar Award)తో రాహుల్ సిప్లిగంజ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడం పట్ల రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ వేదికపై పాడే అవకాశం రాహుల్ కు దక్కడం అంటే అది దేవుడి దయ అని రాహుల్ తల్లి అన్నారు.
కీరవాణి(Keeravani) సార్ కు, రాజమౌళి(Rajamouli), గారికి, వల్లి మేడమ్ కు, రమ మేడమ్ కు చాలా చాలా నమస్కారాలు అని ఆమె కామెంట్లు చేశారు.రాహుల్ సిప్లిగంజ్ ఆ స్టేజ్ కు వెళ్లడం అంటే లక్ అని రాహుల్ తల్లి చెప్పుకొచ్చారు.

నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం అనేది మాకు దక్కిన గొప్ప బహుమతి అని రాహుల్ తండ్రి అన్నారు.మా బిడ్డ ఆ స్థాయికి వెళ్లడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని రాహుల్ తండ్రి చెప్పుకొచ్చారు.మరోవైపు తన బిడ్డ వల్లే ఆస్కార్ లక్ దక్కిందని రామ్ చరణ్ పేర్కొన్నారు.నా భార్యకు ఆరో నెల అని రామ్ చరణ్ అన్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

రాహుల్ సిప్లిగంజ్ బాల్యం నుంచి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.రాహుల్ సిప్లిగంజ్ రేంజ్, రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాహుల్ సిప్లిగంజ్ కు మంచి ఆఫర్లు వస్తే అతని స్థాయి మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.







