కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ అధికారులు చర్యలు తీసుకోవద్దని, తదుపరి విచారణపై స్టే ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెల్లడించే వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది.మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధించి పది డాక్యుమెంట్లు, 35 వాంగ్మూలు, 11 సీడీలను సీల్డ్ కవర్ లో సీబీఐ కోర్టుకు సమర్పించింది.
అదేవిధంగా అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవద్దనే ఆదేశాలు ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరింది.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అయితే ఈ హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.







