ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో చిత్ర బృందంతో పాటు యావత్ భారతదేశం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.95వ అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు(Oscar Award) వేడుకలలో భాగంగా తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు అందుకోవడం దేశానికే గర్వకారణం అని చెప్పాలి.ఇలా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడంతో ఇప్పటికే చిత్ర బృందం అమెరికాలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.

ఇకపోతే ఈ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్(Ram Charan NTR) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.రామ్ చరణ్ బ్లాక్ సూటు ధరించి ఆస్కార్ వేడుకలకు హాజరుకాగా తన భార్య ఉపాసన కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో చీర ధరించి ఈ వేడుకలలో సందడి చేశారు.ఇక నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వచ్చిన అనంతరం రామ్ చరణ్ ఉపాసన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగంగా తాను కూడా ఆస్కార్ అవార్డులకు వచ్చానని తెలిపారు.ఇంతలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాసన ఆరు నెలల గర్భవతి అని తెలిపారు.పుట్టబోయే మా బిడ్డకు ఇప్పుడే ప్రేమ లభిస్తోంది.కడుపులో మా బిడ్డ ఉండగానే మాకు అదృష్టం తెచ్చిపెడుతోంది అంటూ రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రాంచరణ్ ఆస్కార్ వేడుకలలో భాగంగా దాదాపు 15 రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నారు.ఇలా రాంచరణ్ అమెరికాలో ఉండడంతో ఉపాసన కూడా గత కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లి అక్కడే ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈమె కూడా ఆస్కార్ వేడుకలలో పాల్గొన్నారు.







