దిగ్గజ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఒకాయ ఈవీ(Okaya Evie) థాయ్‌లాండ్‌కు ఉచితంగా వెళ్లే ఆకర్షణీయమైన ఆఫర్ ను ప్రకటించింది.అంతేకాదు, ఎలక్ట్రిక్ స్కూటర్(Electric scooter) కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది.క్యాష్‌బ్యాక్ కంటే నాలుగు రోజులు పాటు థాయ్‌లాండ్‌కు ఫ్రీగా వెళ్లి రావచ్చని ఈ కంపెనీ ప్రకటించిన ఆఫర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఒకాయ కార్నివాల్ అనే స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కంపెనీ ఇంత గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది.అయితే స్కూటర్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే థాయ్ లాండ్ ఫ్రీ ట్రిప్ వర్తిస్తుంది.
అంటే ఒక్కరు మాత్రమే థాయ్‌లాండ్(Thailand) కి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
అన్ని ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఈ ఆఫర్లు ఉంటాయి కాబట్టి దేన్నైనా మీరు కొనుగోలు చేసి థాయ్‌లాండ్ కి ఉచితంగా చూసి రావచ్చు.ఒకాయ కంపెనీ(Okaya Company) ఇప్పటివరకు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఫాస్ట్ ఎఫ్2ఎఫ్, ఫాస్ట్ ఎఫ్2బీ, క్లాసిక్ ఐ10 ప్లస్, ఫాస్ట్ ఎఫ్2టీ, ఫ్రీడమ్ ఎల్ఐ వంటివి ఉన్నాయి వీటిలో బడ్జెట్‌ను బట్టి మీకు నచ్చిన దాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఫాస్ట్ మోడళ్లను గంటకు 70 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తాయి.వీటి రేంజ్ కూడా 100కి.మీకి ఎక్కువగానే ఉంటుంది బీఎల్‌డీసీ హబ్ మోటార్‌తో వచ్చే ఈ కంపెనీ స్కూటర్లు ట్యూబ్‌లెస్ టైర్లు, టెలీ స్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్‌లతో వస్తాయి.ఇకపోతే ఫ్రీడట్, క్లాసిక్ మోడల్స్ లో గంటకు 25 కిలోమీటర్లు వేగం, సింగిల్ ఛార్జ్‌పై 75 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాక 24 గంటల్లో ఇన్‌వాయిస్ జనరేట్ అయి మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.ఈ ఎస్ఎంఎస్‌లోని లింక్‌పై క్లిక్ చేస్తే డిజిటల్ స్క్రాచ్ కార్డు మీకు లభిస్తుంది.దీనిలో క్యాష్ బ్యాక్, థాయ్ లాండ్ ట్రిప్ వంటివి ఉంటాయి.