కాంతార సినిమా(Kantara movie) తో అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న హీరో రిషబ్ శెట్టి(Rishab shetty) ఓవర్ నైట్ లో ఇండియాలోనే స్టార్ హీరో అండ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈయన చేసిన చాలా సినిమాలు ప్రస్తుతం తెలుగు లో డబ్ అయి ఓటిటి లో మనకు అందుబాటులోకి వచ్చాయి అవన్నీ చూసిన జనాలు రిషబ్ శెట్టి కి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు… అందుకే ఈయన కి ఇండియాలోని అన్ని భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి ఈయన లో ఉన్నా గొప్ప టాలెంట్ ఏంటంటే ఆయనే హీరో గా చేస్తూ ఆయనే డైరెక్షన్ కూడా చేసుకోగలరు.
అందుకే ఈయనకి మంచి మార్కెట్ ఏర్పడింది.

రిషబ్ శెట్టి ఒక స్టార్ హీరోను పెట్టీ ఒక పెద్ద సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట ఆయన ఎవరు అంటే తెలుగు లో సూపర్ హీరోగా మంచి గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ… ఈయనని హీరో గా పెట్టీ ఒక అద్భుతమైన సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట…అయితే విజయ్(Vijay) చాలా టాలెంటెడ్ అనే విషయం మనందరికీ తెలుసు అర్జున్ రెడ్డి(Arjun Reddy) సినిమా తో ఇతర భాషల్లో కూడా అభిమానులని సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి విజయ్ తో సినిమా చేయబోతున్నాడు అనే విషయం తెలిసిన చాలా మంది షాక్ అవుతున్నారు.ఎందుకంటే రిషబ్ శెట్టి, విజయ్ ఇద్దరు కూడా మంచి టాలెంట్ ఉన్న హీరో లు రిషబ్ తనని డైరెక్ట్ చేయడం నిజంగా ఇద్దరికీ చాలా ప్లస్ అవుతుందని ఇప్పటికే ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…








