గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఇండియాలో బైక్స్ కి బదులు ఎక్కువగా స్కూటర్ల వాడకం బాగా పెరిగింది.బైక్ కంటే ఒక కుటుంబానికి స్కూటర్ ఎక్కువగా ఉపయోగపడుతుందని జనాలు నమ్ముతున్నారు.
ఓ రకంగా చెప్పాలంటే ఒక ఇంట్లో రెండు వెహికల్స్ కి బదులు… ఆడవారికి, మగవారికి ఇద్దరికీ స్కూటర్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది కనుక దానివైపే ఎక్కువశాతం మొగ్గు చూపుతున్నారు.అంతేకాకుండా ట్రాఫిక్ మరియు ఇరుకైన రోడ్ల మధ్యలో గేర్ మార్చే పనిలేకుండా, పదే పదే క్లచ్ వాడడం లాంటి సమస్యలు లేకుండా స్కూటర్ అయితే బావుంటుందని అనుకుంటారు.
ఈ క్రమంలో దేశంలో కొన్ని రకాల వెహికల్స్ అత్యంత ఎక్కువగా ప్రజాదరణ పొందాయి.చాలామంది స్కూటర్ కొనేటప్పుడు మొదట వాటినే కొనాలని తమ లిస్టులో చేర్చుకుంటారు.అందులో మొదటిది “హీరోస్ డెస్టిని.”(Hero’s Destiny) ఇది ముఖ్యంగా లుక్స్‌తో యువత మనసుని కొల్లగొట్టింది.ఇది 125 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.ఈ వేరియంట్ ధర రూ.86,023.దీని తరువాత లిస్టులో వున్నది “హోండా యాక్టివా.”(Honda Activa) దీని ధర రూ.86,715 కాగా ఈ కంపెనీ ఇటీవల తన డీలక్స్ మోడల్‌లో అనేక మార్పులు చేసి కొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు తెచ్చింది.
ఈ లిస్టులో మూడవది “సుజుకి యాక్సెస్.”(Suzuki Access) దీని పేరు కూడా బాగా వినిపిస్తోంది.దీని టాప్ వేరియంట్ ధర రూ.87500గా వుంది.ఎన్నో బెస్ట్ ఫీచర్లుతో ఈ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో వుంది.ఇక నాల్గవది “యమహా ఫాసినో.”(Yamaha Fascino) ట్రెండీ మరియు క్యూట్ లుక్స్ కారణంగా ఇది కాలేజీకి వెళ్లే అమ్మాయిలలో బాగా ప్రాచుర్యం పొందిందని చెప్పుకోవాలి.దీని ధర రూ.88,230 మాత్రమే.ఇక ఇండియాలో బాగా వినబడుతున్న మరో స్కూటర్ పేరు “టీవీఎస్ జుపిటర్.” దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.89,625గా వుంది.ఈ లిస్టులో మీరు ఏ స్కూటర్ కొనుగోలు చేసినా బావుంటుంది.మిగతా ఫీచర్లు కోసం ఆయా కంపెనీల వెబ్ సైట్స్ చూడగలరు.