హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ గా వేధించే సమస్య.స్త్రీలు మాత్రమే కాదు పురుషులు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా మదన పడిపోతుంటారు.
అందులోనూ పెళ్లి కాని మగవారైతే మరింత కలత చెందుతుంటారు.కానీ టెన్షన్ వద్దు.
ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ను కేవలం వారంలో రెండు సార్లు వాడితే ఒక్క వెంట్రుక కూడా రాలదు.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసు కొబ్బరి నూనె(coconut oil) వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో నాలుగు మందారం పువ్వులు(Hibiscus flowers), నాలుగు మందార ఆకులు, అర కప్పు ఫ్రెష్ రోజ్ మేరీ ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్(Amla powder), వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బృంగరాజ్ పౌడర్(Bhringraj powder), ఐదు లవంగాలు వేసి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.వారంలో రెండుసార్లు ఈ సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.
కాసేపు మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను అప్లై చేసుకుని.
మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి.ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు కదుళ్లు బలంగా మారతాయి.
హెయిర్ ఫాల్ క్రమంగా కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తెల్ల జుట్టు సమస్య త్వరగా దరిచేరకుండా కూడా ఉంటుంది.