ప్రెగ్నెన్సీ టైంలో వేధించే పాదాల వాపును ఎలా నివారించుకోవాలో తెలుసా?

ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో స్త్రీల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.అందులోనూ మొదటి ప్రెగ్నెన్సీ అయితే కొత్త కొత్త అనుభవాలు, అనుభూతులు.

అనేక మధుర క్షణాలు.కొన్ని చేదు జ్ఞాపకాలు.

అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో పలు అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తుంటాయి.ఈ జాబితాలో పాదాల వాపు ముందు వరుసలో ఉంటుంది.

గర్భంతో ఉన్నప్పుడు కాళ్ల పాదాలు వాపు రావడం సర్వ సాధారణం.తరచుగా కాళ్ళు, చీలమండలు, పాదాలు, వేళ్లు ఉబ్బినట్లుగా కొంత వాపు రావడం కనిపిస్తుంది.

Advertisement

పాదాలు వాపులు(swollen feet) రావడం వల్ల కడుపులో ఉన్న శిశువుకు ఎలాంటి హాని ఉండదు.కానీ గర్భిణీలు మాత్రం కాస్త అసౌకర్యానికి గురవుతుంటారు.

నడవడానికి కూడా ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటుంది.ఈ క్రమంలోనే పాదాల వాపులు వదిలించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా పాదాల వాపులను నివారించుకోవచ్చు.

ఎక్కువగా నిలబడి ఉన్నప్పుడు పాదాల వాపు మొదలవుతుంది.కాబట్టి గంటలు తరబడి నిలబడి ప‌ని చేసే వారైతే ప్రతి అర గంట కీ ఒకసారి బ్రేక్ తీసుకుని కాసేపు కూర్చోండి.శరీరానికి సరిపడా వాటర్ (Water) అందకపోయినా పాదాలు వాపులు వస్తాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అందుకే బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉంచుకోవాలి.అందుకోసం ప్రతి రోజు పుష్కలంగా వాటర్ ను తీసుకోండి.

Advertisement

సరైన విశ్రాంతి లేకపోయినా పాదాలు వాపులు వస్తాయి.కాబట్టి గర్భిణీలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.

పాలకూర, బీన్స్ , దానిమ్మ, అరటి పండ్లు, అవ‌కాడో, నారింజ, కూరగాయలు, ఎండు ద్రాక్ష‌ ఇలా పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోండి.ఆ ఆహారాలు పాదాల‌ వాపును తగ్గించ‌డానికి ఎంత‌గానో సహాయపడతాయి.అలాగే ఎప్పుడూ కూర్చుని ఉన్న పాదాలు వాపులు వస్తాయి.

అందువ‌ల్ల రోజులో కనీసం ముప్పై నుంచి న‌ల‌భై నిమిషాలు అయినా వాకింగ్ చేయాలి.దీని వల్ల పాదాల వాపులను సుల‌భంగా నివారించుకోవచ్చు.

తాజా వార్తలు