ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వస్తుందా.. రాదా.. కోట్లలో బెట్టింగ్?

యావత్ భారతదేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్కార్ వేడుకలు భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5:30 లకు ప్రారంభం అయ్యాయి.ఈ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

 Will Rrr Get An Oscar.. Or Not.. Betting In Crores ,rrr, Oscar Award,natu Natu-TeluguStop.com

లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్లో ఈ వేడుక కనుల పండుగగా ప్రారంభమైంది.ఇక ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకలపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.

అయితే ఈ ఏడాది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu song) ఆస్కార్ నామినేషన్స్ లో నిలవడంతో అందరూ చూపు ఈ వేడుకల పైన ఉంది.

Telugu Dolbytheater, Natu Natu, Oscar Award, Oscar-Movie

ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి చిత్ర బృందం తప్పనిసరిగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు(Golden Globe Award) కూడా రావడంతో తప్పనిసరిగా ఆస్కార్ కూడా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందా రాదా అనే విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా జరుగుతుండడం విశేషం.

సాధారణంగా ఐపీఎల్ జరిగితే కోట్లలో బెట్టింగులు కాస్తూ ఉంటారు.అలాంటిది RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వస్తుందా రాదా అనే విషయంపై కూడా భారీగా బెట్టింగులు(Betting) జరిగినట్టు తెలుస్తుంది.

Telugu Dolbytheater, Natu Natu, Oscar Award, Oscar-Movie

ఇక ఈ అవార్డుపై జరిగే బెట్టింగ్ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నట్టు సమాచారం.1:4నిష్పత్తిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం.ఇక ఈ పాట విషయంలో కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు టెక్నీషియన్లు కూడా కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు.

Telugu Dolbytheater, Natu Natu, Oscar Award, Oscar-Movie

అయితే మొదటిసారి ఒక తెలుగు సినిమా ఇలా ఆస్కార్ నామినేషన్లలో నిలవడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆసక్తి నెలకొని ఇలా కోట్ల రూపాయలు బెట్టింగులు వేసే వరకు వెళ్లిందని చెప్పాలి.ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు కూడా ఆస్కార్ కి పోటీ పడుతున్నాయి.మరి ఈ పాటకు ఆస్కార్ వస్తుందా రాదా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube