భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఆస్కార్ వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈసారి భారతదేశంలో నుంచి తెలుగు సినిమా RRR ఈ నామినేషన్స్ లో ఉండడంతో అందరి చూపు ఆస్కార్ వేడుకల పైనే ఉంది.
ఇక ఈ వేడుకలో సోమవారం ఉదయం 5:30 నిమిషాలకు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుక ప్రారంభమైంది.
ఇక ఈ వేడుకలలో తప్పనిసరిగా ఆస్కార్ గెలిచాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.ఆస్కార్ అవార్డ్స్(Oscar Awards) నేపథ్యంలో ఇప్పటికే అమెరికా చేరుకున్న ఆర్‌ఆర్‌ఆర్ టీమ్.
నేడు ఆస్కార్ వేదిక వద్ద.సందడి చేస్తున్నారు.

ఇక ఈ వేడుక ప్రారంభం కాకముందు శాంపెయిన్ కార్పెట్ నిర్వహించారు.ఈ శాంపెయిన్ కార్పెట్ పై హాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి RRR చిత్ర బృందం సందడి చేశారు.ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్( Ram Charan) ఆల్ బ్లాక్ స్టైలీష్ లుక్‌లో తళుక్కుమన్నారు.దర్శకుడు రాజమౌళి మాత్రం ఈ వేడుకకు భారతీయ సాంప్రదాయ దుస్తులలో హాజరయ్యారు.
రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి రామ్ చరణ్ శాంపెయిన్ కార్పెట్‌పై నడిచారు. ఇక అద్భుతమైన పాటను ఆలపించిన సింగర్స్ రాహుల్ కాలభైరవKalabhairava) సైతం శాంపెయిన్ కార్పెట్‌పై నడిచారు.

ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఇలా ఆస్కార్ వేడుకలలో చరణ్ తారక్ ఇద్దరు కూడా చాలా స్టైలిష్ లుక్ లో సందడి చేస్తున్నారు.

ఇలా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్లో చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా ఇన్నేళ్ల భారతీయ చిత్ర పరిశ్రమకు నేడు ఎంతో గర్వకారణమైన రోజు అని చెప్పాలి.ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినటువంటి చిత్ర బృందానికి నేడు సరైన ప్రతిఫలం దక్కబోతుందని ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.







