ఇండియాలో కార్ల అమ్మకాలు రానురాను పెరుగుతున్నాయి.ఆమాత్రం శాలరీ తీసుకున్న సగటు ఉద్యోగి కూడా తన కుటుంబంతో దూర ప్రయాణాలు చేసే నిమిత్తం కార్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు.
ఈ మధ్య కాలంలోనే ఈ మార్పు బాగా మొదలయిందని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా కోవిడ్ రాక తరువాత.
ఇక్కడ మార్కెట్ ని గమనిస్తే మారుతి, హ్యుందాయ్, టాటా వంటి ప్రముఖ తయారీదారుల నుంచి వచ్చిన SUVలు మంచి ఊపందుకున్నాయి.ఎందుకంటే ఎక్కువమంది వీటిపైనే మొగ్గు చూపుతుండడం విశేషం.

ఇకపోతే కొత్తగా కారు కొనాలి అనుకున్నవారికి మంచి ఆప్షన్ తెలుసుకొనే మార్గం తెలిసి ఉండకపోవచ్చు.అలాంటివారికోసమే ఈ కధనం.ఈమధ్య కాలంలో ఇక్కడ చాలామంది ఇష్టపడి కొనుక్కున్న కార్లలో మొదటి స్థానంలో వున్నది మాత్రం మారుతి సుజుకి నుంచి బ్రెజా SUV(Brezza SUV)అని చెప్పుకోవచ్చు.గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇది 71 శాతం వృద్ధి సాధించింది అని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా ఎక్కువమంది కొనుగోలు చేసిన మరో కారు “టాటా నెక్సాన్”(Tata Nexon)భారతీయ వాహనదారులు అతిగా ఇష్టపడే మరొక కారు ఇది.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.ఇదే కంపెనీనుండి వచ్చిన “టాటా పంచ్” కారుని కూడా చాలామంది కొటుంటున్నారు.ఇది అక్టోబర్ 2021లో భారత్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి టాటాకు ఈ కారు మంచి లాభాలు తెచ్చి పెడుతోంది.
తరువాత ఈ లిస్టులో వున్నది “హ్యుందాయ్ వెన్యూ”(Hyundai Venue) క్రెటా తర్వాత అత్యంత అమితంగా ప్రేమించే కారుగా ఇది సదరు కంపెనీ నుంచి గుర్తింపు పొందింది.ఇక చివరగా కియా కంపెనీనుండి వచ్చిన “కియా సోనెట్”(Kia Sonet) ఈ లిస్టులో ఐదవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
దేశంలో కియా కార్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి.ఈ సంస్థ భారతీయ మార్కెట్ లో వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.







