వైరల్: అక్కడ కంగారూల గుంపు... హరివిల్లులాగా కదిలింది... ఎక్కడంటే?

కంగారూల గుంపు హరివిల్లులాగా కదలడం ఏమిటని అనుకుంటున్నారా? ఆ విషయం తెలియాలంటే ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.ఆస్ట్రేలియాని కంగారూల నివాసం అని కూడా అంటారు.

 Viral There Is A Group Of Kangaroos Moving Like Rainbows Where, Kangaroo, Viral-TeluguStop.com

ఇక్కడ చాలా అరుదైన తెల్లటి, నల్లటి (అల్బినో) కంగారూలు తాజాగా ప్రత్యక్షమై స్థానికులను కనుల విందు చేసాయి.ఆస్ట్రేలియాలోని(Australia) మార్నింగ్‌టన్ ద్వీపకల్పంలో ఉన్న ప్రైవేట్ వన్యప్రాణుల అభయారణ్యం అయినటువంటి పనోరమా అభయారణ్యంలో ఈ అందమైన దృశ్యం చోటుచేసుకోగా తన ఫేస్‌బుక్ పేజీలో తెల్ల కంగారూల గుంపు ఫోటోను షేర్ చేయడం జరిగింది.

దాంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ వీడియోకు ఇపుడు వేళల్లో లైక్‌లు, కామెంట్స్‌ రావడం కొసమెరుపు.ఈ సందర్భంగా అల్బినో కంగారూల గురించి పనోరమా రిజర్వ్(Panorama Reserve) యజమాని ఒకరు మాట్లాడుతూ.2012లో దక్షిణ ఆస్ట్రేలియా నుండి మూడు అరుదైన అల్బినో(Albino) (తెలుపు) కంగారూలను రక్షించి ఇక్కడ సంరక్షిస్తున్నట్టుగా చెప్పారు.ఈ క్రమంలో ఫారెస్ట్‌లో మొత్తం తొమ్మిది తెల్ల కంగారూలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.అరుదైన అల్బినో కంగారూలతో పాటు, దాదాపు 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అభయారణ్యం అనేక ఇతర అడవి జంతువులకు కూడా కేంద్రబిందువుగా ఉంది.

ఇక్కడ కంగారులతో పటు మేకలు, అల్బాకాస్, వాలబీస్, ఈముస్, బాతులు, ఆవులు, నెమళ్ళు, చిలుకలు కూడా ఉన్నాయి.ఈ జంతువులు అడవిలో పెరగడానికి, జీవించడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందజేస్తున్నారు.ఇక్కడ అల్బినిజం(Albinism) అంటే ఏమిటంటే మొక్కలలో పుట్టుకతో మెలనిన్ లేకపోవడం, ఫలితంగా తెల్ల జుట్టు, తెల్లటి చర్మం, నీలి కంటి రంగు అనేది వస్తుంది.ఈ పరిస్థితి జంతువులలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

ముఖ్యంగా కంగారూలలో ఈ లక్షణం కనిపిస్తుంది.ఇలా ఆల్బినిజం, లూసిజంతో జన్మించే అవకాశం 50,000 కంగారూలలో ఒకటి మాత్రమే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube