కాలిఫోర్నియాలోని గురుద్వారాను తగలబెట్టడానికి వ్యక్తులను నియమించిన భారతీయ సంతతికి చెందిన 60 ఏళ్ల సిక్కు వ్యక్తికి షాక్ తగిలింది.ఇతడి కుట్ర ముందుగానే బయలు అయింది.
దాంతో అతడిని యునైటెడ్ స్టేట్స్‌లో అరెస్టు చేశారు.ఈ కుట్ర పన్నిన వ్యక్తి పేరు రాజ్‌వీర్ రాజ్ సింగ్ గిల్(Rajveer Raj Singh Gill).
ఇతను బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ మాజీ అభ్యర్థి.అయితే ఈ ఎన్ఆర్ఐ మార్చి 4న బేకర్స్‌ఫీల్డ్‌లోని అతిపెద్ద సిక్కు ప్రార్థనా స్థలాల్లో ఒకటైన గురుద్వారా షహీద్ బాబా దీప్ సింగ్ జీ ఖల్సా దర్బార్‌ను దగ్ధం చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ కుట్ర బట్టబయలు కావడంతో అతన్ని అరెస్టు చేశారు.అతని నివాసంలో అధికారులు సెర్చ్ వారెంట్‌ను అమలు చేసిన తర్వాత ఆరు నేరాల బెదిరింపులకు సంబంధించి గిల్‌ను అరెస్టు చేశారు.
గురుద్వారాను తగలబెట్టడానికి బదులుగా ఒక వ్యక్తికి డబ్బును ఆఫర్ చేయడంతో పాటు, గిల్ తనతో గొడవలు ఉన్న ఇతరులను కాల్చిచంపడానికి ప్రజలకు డబ్బు చెల్లించడానికి కూడా ప్రయత్నించాడు.గిల్ 2022లో మన్‌ప్రీత్ కౌర్‌కి వ్యతిరేకంగా సిటీ కౌన్సిల్ వార్డ్ 7కి పోటీ చేసేందుకు ప్రయత్నించాడు.కాగా మన్‌ప్రీత్ కౌర్(Manpreet Kaur) ఎన్నికల్లో గెలిచారు.బేకర్స్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి సిక్కు పంజాబీ మహిళగా మన్‌ప్రీత్ రికార్డు సృష్టించారు.
ఆలయ బోర్డు సభ్యుడు అమ్రిక్ సింగ్ అథ్వాల్ (Amrik Singh Athwal)మాట్లాడుతూ, గిల్ దాడులు చేయడానికి వ్యక్తులను నియమించాడని, వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు.ఆలయ పెద్ద సుఖ్‌విందర్ సింగ్ రాంఘీ ప్రకారం 2020, జులైలో జప్తు నుంచి ఆలయాన్ని కొనుగోలు చేయడానికి ప్రజలు $800,000 విరాళంగా అందించారు.ఈ విషయంలో విభేదాల కారణంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయని సుఖ్‌విందర్ సింగ్ రాంఘీ(Sukhwinder Singh Ranghi) చెప్పారు.ఆ డబ్బును కార్పొరేట్ సంస్థకు తిరిగి చెల్లించాల్సి ఉంది, అయితే దాని గురించి సమస్యలు ఉన్నాయి.
ఇదే విషయంలో గిల్ కుట్ర పన్నాడు.పోలీసులు అరెస్టు చేశారు.