Venu : అవకాశాల కోసం బాత్రూమ్ లు కూడా కడిగా.. వేణు ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వేణు(Venu)తరువాత కాలంలో వెండితెరపై కూడా రాణించిన విషయం తెలిసిందే.

 Comedian Venu About His Struggles Balagam Movie-TeluguStop.com

ఇటీవల బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా ప్రారంభించాడు.ఇది ఇలా ఉంటే వేణు తాజాగా దర్శకత్వం వహించిన సినిమా బలగం.

ఈ సినిమాతో వేణు దర్శకుడుగా కూడా మారారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపారు.1999లో ఇంటి నుంచి పారిపోయి వచ్చాను.

Telugu Balagam, Venu, Jabardasth, Struggles-Movie

ఎన్నో ఇబ్బందులు పడిన తరువాత ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను.ఓ రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశాను.చిత్రం శ్రీను (chitram Srinu)అన్న దగ్గర టచప్‌ బాయ్‌గా కూడా జాయిన్‌ అయ్యాను.

ఆ తర్వాత దాదాపు 200 సినిమాలు చేశాను.కానీ కమర్షియల్‌ బ్రేక్‌ రాలేదు.

నా తర్వాత వచ్చినవాళ్లందరూ ముందుకు పోతున్నారు.కానీ నాకు మాత్రం అంత గుర్తింపు రావడం లేదని ఫీలయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వేణు.

తాజాగా విడుదల అయిన బలగం (Balagam)సినిమా కథ రాసుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నాను.ఆ సమయంలో నా స్నేహితుడు ప్రదీప్‌ చిలుకూరికి(Pradeep Chilukuriki) కథ చెప్పాను.

ఆయన కూడా ఓ డైరెక్టర్‌.

Telugu Balagam, Venu, Jabardasth, Struggles-Movie

కథ విని ఇంత మంచి స్టోరీ దగ్గర పెట్టుకుని నిర్మాతల కోసం తిరుగుతున్నావా? అన్నాడు.ఆ మర్నాడే శివరామ్‌ దగ్గరకు వెళ్లడం, ఆయన ఓకే చెప్పడం.దీన్ని దిల్‌ రాజు దగ్గరకు తీసుకెళ్లడం, సినిమా రిలీజ్ అవ్వడం అన్ని చకచకా జరిగిపోయాయి.

ఈ సినిమాను అందరూ ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు వేణు.కాగా గతంలోనూ తాను పడ్డ కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అవకాశాల కోసం అంట్లు తోమడమే కాక బాత్రూమ్‌లు కూడా కడిగానని తెలిపాడు.ఇన్నాళ్లకు అతడికి మంచి బ్రేక్‌ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube