బీజేపీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి చురుకైనా నాయకుడని తెలిపారు.
కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీ బలోపేతానికి దోహద పడుతుందని సోము వీర్రాజు వ్యాఖ్యనించారు.పదో తరగతి చదవని వారిని పట్టభద్రుల ఎన్నికలలో ఓటర్లుగా నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని పేర్కొన్నారు.
దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించడం సరికాదని చెప్పారు.
రాష్ట్రంలో ఇసుక, ఖనిజాలను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు.







