కుర్రాళ్ళ మదిలో క్రష్ గా ఉన్న సెలెబ్రిటీలు పెళ్లి వార్త చెబితే చాలు కుర్రాళ్ళ మనసు ముక్కలవుతుంది.ఎందుకంటే తమ క్రష్ ను వేరే వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు అంటే అస్సలు తట్టుకోలేక పోతారు.
అయితే ఇప్పుడు అటువంటిదే కొందరి కుర్రాళ్లకు ఎదురయ్యింది.తమ క్రష్ పెళ్లి గురించి ప్రకటించడంతో ఆ కుర్రాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
ఇంతకు ఆమె ఎవరో కాదు కార్తీకదీపం నటి మోనిత.
గత ఆరు సంవత్సరాలుగా బుల్లితెరపై ఓ రేంజ్ లో సందడి చేసింది కార్తీకదీపం సీరియల్.
అయితే ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించింది మోనిత.క్యారెక్టర్ నెగెటివ్ అయినా కూడా కుర్రాళ్ళు మాత్రం తన అందాన్ని చూసి పడిపోయారు.
చాలా వరకు ఈ సీరియల్ ఆమె కోసం చూసిన వాళ్ళు ఉన్నారని చెప్పాలి.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా.
కుర్రాళ్ళు ఆమెను అస్సలు మర్చిపోలేక పోతున్నారు.
దీంతో ఆమె కూడా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను దూరం చేసుకోకుండా.
ఆమె సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటుంది.అయితే తాజాగా తను తన పెళ్లి గురించి ప్రకటించడంతో కుర్రాళ్లు షాక్ అయ్యారు.
ఇంతకు ఆమె తన పెళ్లి గురించి ఏ విధంగా ప్రకటించిందో చూద్దాం.అయితే మోనిత అసలు పేరు శోభా శెట్టి.
ఈమె కన్నడకు చెందిన నటి.ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.

అయితే ఈమెకు కార్తీకదీపం సీరియల్ మంచి గుర్తింపును తెచ్చింది.ఇక ఈ సీరియల్ తోనే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది.

ఈమె ఫోటోలను రీ పోస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు.నిజానికి ఈమె ఫోటోలు పంచుకుంటే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో ఒక వీడియో పంచుకుంది.
అయితే ఆ వీడియో చూసి కుర్రాళ్లంతా చాలా బాధపడుతున్నారు.

ఎందుకంటే ఆమె తన పెళ్లి కోసం జ్యువెలరీ షాపింగ్ చేసింది కాబట్టి.అయితే ఆ వీడియోలో తను నగల డిజైన్లు చూస్తూ వాటిని ధరిస్తూ కనిపించింది.అంతే కాకుండా తను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నట్లు తెలిపింది.
అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను అని తెలుపలేదు కానీ.నగలు మాత్రం పెళ్లి గురించి అన్నట్లు తెలిపింది.
దీంతో ఆ వీడియో చూసి చాలామంది కుర్రాళ్ళు మా హార్ట్ బ్రేక్ చేశావు అంటూ.ఇక నిన్ను మా క్రష్ లిస్టులో నుంచి తీసేస్తున్నాము అంటూ బాధపడుతూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.







