టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
ఈ సినిమా విడుదల ఏడాది పూర్తి కావస్తున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు.తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం కొద్దిరోజులుగా అమెరికాలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడే ఉంటున్న చిత్ర బృందం అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.దీంతో గత వారం రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన వార్తల గురించి సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి.అక్కడ ఇంటర్వ్యూలలో చరణ్ రాజమౌళి,ఎన్టీఆర్ లు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా చెర్రీ మాట్లాడుతూ.రాజమౌళి మార్వెల్ మూవీస్‌కు డైరెక్షన్ వహించాలని ఆశిస్తున్నాను.

ఒకవేళ అదే జరిగితే అందరికీ పార్టీ ఇస్తాను.నేను వాళ్ల ప్రతి సినిమాలోనూ ఉండాలని అనుకుంటాను.ప్రస్తుతం సినిమా రంగానికి ఎటువంటి హద్దులూ లేవు.హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు కూడా లేవు.అలాంటి ఓ రంగంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు చరణ్.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి ఎంపిక అయిన విషయం తెలిసిందే.
ఇక ఆస్కార్ అవార్డు కోసం చిత్ర బృందం తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







