సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చాలా సందర్భాల్లో తమ సినిమాల కోసం ఎన్నో రిస్క్ లు తీసుకుంటూ ఉంటారు.అయితే ఈ విషయాలను బయటకు చెప్పుకోవడానికి హీరోలు ఇష్టపడరు.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని ఫ్లాప్ సినిమాలలో నరసింహుడు సినిమా కూడా ఒకటి.బి.
గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.చెంగల వెంకట్రావు ఈ సినిమాకు నిర్మాత అనే సంగతి తెలిసిందే.
అయితే నరసింహుడు సినిమా రిలీజ్ ఆగిపోతే జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఫైనాన్షియర్లకు కట్టి ఈ సినిమాను అప్పట్లో రిలీజ్ చేయించారు.ఫైనాన్షియర్ల ఒత్తిడి వల్ల ఈ సినిమా రిలీజ్ కు ఇబ్బందులు ఎదురు కాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ విధంగా చేశారు.
అయితే ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైంది.

కన్నడ సినిమా స్క్రిప్ట్ కు మార్పులు చేసి తెలుగులో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు.సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొంత సమయం పాటు మాటలు రాకుండా నటించడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది.ఈ సినిమా షూట్ సమయంలో మూవీ అనుకున్న విధంగా రావడం లేదని బి.గోపాల్ భావించారట.నరసింహుడు సినిమా ఫలితం జూనియర్ ఎన్టీఆర్ ను బాధ పెట్టింది.

ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బి.గోపాల్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ సినిమాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలపై దృష్టి పెట్టారు.జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఎన్టీఆర్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కానున్నారు.
తారక్ మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







