ట్విట్టర్లో మహిళా నెటిజన్ ట్వీట్కు అద్భుతంగా రెస్పాండ్ అయిన కేటీఆర్

తెలంగాణ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిందే .సమస్యలపై నెటిజనులు చేసే ట్వీట్స్ కు వెంటనే సమాధానం ఇస్తూ వాటిని పరిష్కరిస్తూ ఉంటారు.

 Ktr Responded Brilliantly To A Female Netizens Tweet On Twitter ,ktr ,womensafte-TeluguStop.com

చాలామంది రాజకీయ నాయకులు లాగా కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా సాధ్యమైనంత తొందరగా పరిష్కారం మార్గాలు కూడా చూపెడుతూ ఉంటారు.ఇదే చాలామంది రాజకీయ నాయకుల కన్నా ఆయనకని ప్రత్యేకంగా నిలబడుతుంది అని చెప్పవచ్చు .ఇంతకుముందు కూడా సహాయం కోరిన చాలామందికి ఆయన పరిష్కారం చూపారు.రాత్రి పది తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో ప్రజా రవణా గాని, మెట్రో రవాణా గాని అందుబాటులో లేదని ఇది స్త్రీల భద్రతకు ప్రమాదకరమైన పరిణామమని దీనిపై పరిష్కారం చూపవలసిందిగా ఒక మహిళ ట్వీట్ చేశారు.

Telugu Anjani Kumar, Tweet-Telugu Political News

దీనిని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బహుమతిగా భావించవలసిందిగా ఆమె కోరారు.దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ ఆ విషయాన్ని తెలంగాణ డిజిపి కి ట్యాగ్ చేస్తూ అన్ని తెలంగాణ బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్లో రాత్రి పది తర్వాత రవాణా ట్రాకింగ్ వ్యవస్థను మెరుగుపరచుకోవాలని, రవాణా అవకాశాలను చూపాలని డీజీపీ అంజనీ కుమార్ కు సూచించారు దీనిపై డీజీపీ కూడా వెంటనే స్పందించారు ఇది చాలా మంచి ఆలోచన అని ఇది అమలు చేయడానికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Telugu Anjani Kumar, Tweet-Telugu Political News

రాజకీయ నాయకుల అంతిమ గమ్యం అధికారం అయితే కావచ్చు, కానీ దానికన్నా ముందు ప్రజా సంక్షేమమే అధికారం యొక్క పరమావధి అవ్వాలి.విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయాల్లో సాధారణమైనవే కానీ ప్రజల అవసరాలను తీరుస్తూ వారి అభివృద్ధికి బాటలు వేసే వారిని ప్రజలు కూడా అంత తేలిగ్గా వదులుకోరు.ఈ లక్షణాలు ఉండటం వల్లనే కేటీఆర్ తెలంగాణలో రోజురోజుకీ తన ఇమేజ్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు .ఇదేవిధంగా ఆయన కొనసాగితే ఆయన కోరుకున్న స్థానానికి చేరుకునే రోజు తొందరలోనే ఉంటుందని ఆశించవచ్చు కేవలం వారసత్వం కారణంగానే ఆయనకు అధికారం అందింది అన్న విమర్శలను అతి కొద్ది రోజుల్లోనే తన నాయకత్వ పటిమతో, పరిపాలన విధానాలతో చెరిపేసిన కేటీఆర్ అసలైన నాయకుడిగా రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube