వైరల్: చైనా వాళ్ళ కక్కుర్తి చూడండి... హోటల్‌లో టాయిలెట్ పక్కనే బెడ్ ఏర్పాటు చేసారు!

ఎంత కక్కుర్తో చూడండి! ఇలా ఐతే కోట్లు గడించేయొచ్చు.బహుశా పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తయినా ఇలా ప్రవర్తించి ఉండడు అని చెప్పుకోవాలి.

 China Micro Hotel Room Has Toilet Beside Bed Details, China, Bed Room, Behind, T-TeluguStop.com

పేరుగొప్ప, వూరు దిబ్బ అనే నానుడి చైనాకి (China) బాగా సరిపోతుంది.చైనాలోని ఒక హోటల్ బిజినెస్ లో భాగంగా సరికొత్త ఆలోచనలతో మైక్రో రూమ్ లను(Micro Room) రూపొందించిందనే విషయం బయటకు పొక్కగానే దానిని కొంతమంది అతిధులు విజిట్ చేసి, అది కొత్త ఐడియా కాదు, పరమ చెత్త ఐడియాని తేల్చి చెప్పారు.

అవును, సదరు హోటల్ లో సుమారు ఎనిమిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న గదుల్లో బెడ్, టాయిలెట్‌తో కూడిన మైక్రో రూమ్‌లను రెంట్ కు ఇస్తుండడం కొసమెరుపు.

Telugu Bed, China, China Hotel, China Micro, Toilet, Toilet Bed, Latest-Latest N

ఈ రూమ్స్ కు చైనా కరెన్సీలో రోజుకు దాదాపు 60 యువాన్లు వసూలు చేస్తున్నారు.అంటే మన దేశ కరెన్సీలో రూ.700 అన్న మాట.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఫిబ్రవరిలో ఒక బ్లాగర్ షేర్ చేయగా అది కాస్త వెలుగు చూసింది.వైరల్ అవుతున్న వీడియోని గమనించినట్లతే అందులో చిన్న గది కనిపిస్తుంది.

అందులో ఒక డబుల్ కాట్ బెడ్, టాయిలెట్ మాత్రమే వుంది.కాగా ప్రస్తుతం ఈ వీడియో డ్రాగన్ కంట్రీలో చర్చకు దారితీసింది.

ఈ రూమ్ లో అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయని.శుభ్రంగా ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించినప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Telugu Bed, China, China Hotel, China Micro, Toilet, Toilet Bed, Latest-Latest N

ఈ గది విషయం తెలుసుకున్న బ్లాగర్ “హే మావో జాంగ్” దృష్టిలో పడగా ఆ గదిని రెంట్ కు తీసుకుని ఓ 3 గంటలు గడిపాడు.అతని అనుభవాన్ని చెబుతూ… మంచం టాయిలెట్‌కి చాలా దగ్గరగా ఉండడం వలన గదిలో కొంచెం చెడు వాసన వస్తుందని చెప్పాడు.మైక్రో రూమ్ లో(Micro Room) బెడ్, టాయిలెట్ మాత్రమే కాకుండా ఎయిర్ కండీషనర్, అద్దం, కోట్ హ్యాంగర్, వాష్ బేసిన్, కెటిల్, వెంటిలేటర్, ల్యాండ్‌స్కేప్ పెయింటింగ్ వంటి ఇతర సౌకర్యాలు కూడా వున్నాయి.ఈ సందర్భంగా హోటల్ యజమాని మాట్లాడుతూ… అక్కడికి సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను సందర్శించే రోగులు లేదా రోగుల బంధువులు, పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులు చాలా ఉపయోగం అని హోటల్ యజమాని చెప్పాడు.

ఏదిఏమైనా నెటిజన్లు దీనిపైన విరుచుకు పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube