యుద్ధానికి రెడీ కావాలంటూ సైన్యానికి కిమ్ కీలక ఆదేశాలు..!!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలకులలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది.నియంతృత్వ పోకడలతో పరిపాలిస్తూ ఉంటారు.

 Kim's Key Orders To The Army To Be Ready For War North Korea, Kim Jong Un , Us-TeluguStop.com

ఉత్తరకొరియా ప్రజలు కిమ్ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియా ఎప్పటినుండో అనేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది.ఆ దేశంలో అసలు ఏం జరుగుతుంది అన్నది బయట ప్రపంచానికి తెలీకుండా… చాలా కట్టుదిట్టంగా కిమ్ పాలన ఉంటుందని అంటారు.

పరిస్థితి ఇలా ఉండగా మరొక పక్క ఇటీవల కిమ్ వరుస పెట్టి క్షిపణిల ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే సోమవారం అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేపట్టబోతున్నాయి.

ఇటువంటి సమయంలో ఉత్తర కొరియా సైన్యానికి దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.అసలైన యుద్ధానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు.

శుక్రవారం తన కుమార్తెతో కలిసి సైనిక డ్రిల్ వీక్షించడం జరిగింది.ఆ సమయంలో ఉత్తర కొరియా సైనిక అధికారులతో కలిసి ఫిరంగి యూనిట్ క్షిపణుల మాస్ ఫైరింగ్ వీక్షించడం జరిగింది.

రెండు కొరియా దేశాల మధ్య దశాబ్దాలకు పైగా నువ్వా నేనా అన్నట్టు కత్తుల  ధూసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు గత కొంతకాలం నుండి పాల్పడుతూ ఉంది.

ఇటువంటి పరిస్థితులలో అమెరికా సాయంతో దక్షిణ కొరియా సోమవారం అతిపెద్ద సైనిక విన్యాసాలు చేపడుతూ ఉండటంతో… కిమ్ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునివ్వటం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube