కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పిటిషన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అవినాశ్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
అదేవిధంగా ఎంపీ అవినాశ్ రెడ్డిని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు తెలిపింది.వివేకా రాసిన లెటర్ తో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ సమర్పించాలని కోర్టుకు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.అయితే తనను విచారించేటప్పుడు ఆడియో, వీడియో తీయాలని, అదేవిధంగా లాయర్ సమక్షంలో విచారణ జరపాలని అవినాశ్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
సీబీఐ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.







