డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో జోరు కొనసాగిస్తోంది.ఆడిన మూడు మ్యాచ్లలో గెలిచి లీగ్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచింది.హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థి జట్టులను సులభంగా ఎదుర్కొని చిత్తు చేస్తోంది.20 మ్యాచ్ల లీగ్ లో మూడు రౌండ్ల మ్యాచులు ఆడిన ముంబై వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటే.ఢిల్లీ రెండు విజయాలను, ఒక ఓటమిని సొంతం చేసుకుంది.డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మూడో రౌండ్ లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో 18 ఓవర్లలో 105 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఢిల్లీ జట్టు.

మెక్ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ జట్టు వరుసగా రెండు విజయాలను అందుకొని.మూడవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఘోరంగా ఓడిపోయింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్.కెప్టెన్ మెగ్ లానింగ్ 43 పరుగులు, జేమీయా రొడ్రిగేజ్ 25 పరుగులు, రాధా యాదవ్ 10 పరుగులు చేశారు.
మిగిలిన ప్లేయర్స్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.ముంబై ఇండియన్స్ బౌలర్ అయిన సైకా ఇషాక్ మూడు వికెట్లు, వాంగ్ మూడు వికెట్లు, హేలీ మ్యాథ్యూస్ మూడు వికెట్లు తీస్తే ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ చేయకుండా చిత్తుగా ఓడి పోయింది.

20 ఓవర్లలో 106 పరుగుల లక్ష్యచేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఫుల్ జోరు కొనసాగించి రెండు వికెట్ల నష్టానికి 15 ఓవర్లలో 109 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.యాస్టికా 32 బంతుల్లో 41 పరుగులు, హేలీ మ్యాథుస్ 31 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు.నాట్ స్కివయర్ 23 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ముంబై బ్రబోర్న్ స్టేడియంలో నేడు రాత్రి 7:30 గంటలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.







