ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.ఈడీ నోటీసులు అందుకున్నానన్న కవిత ఈనెల 16వ తేదీ తర్వాత విచారణకు వస్తానని చెప్పానని తెలిపారు.
ముందుగా 11న ఇంటికి వచ్చి విచారణ జరపాలని అధికారులను కోరానన్నారు కవిత.మహిళ ఇంటికొచ్చి విచారణ జరపాలని చట్టంలో ఉందన్నారు.
ఇంకెవరైనా నిందితులతో కలిసి విచారించాలంటే వారిని కూడా తీసుకురావాలని సూచించానని తెలిపారు.కానీ ఒప్పుకోని ఈడీ అధికారులు కార్యాలయానికే రావాలంటున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఈడీ విచారణకు సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు.