కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇటీవలే వారసుడు సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆ వెంటనే తన 67వ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు.మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో విజయ్ దళపతి 67వ సినిమా ”లియో” తెరకెక్కుతుంది.
కోలీవుడ్ లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాల్లో లియో ఒకటి కాగా ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలను పెట్టుకున్నారు.ఈ సినిమా గత కొన్ని రోజుల క్రితమే షూట్ స్టార్ట్ చేయగా ఇందులో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుండగా.
సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.ఇక సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కు పోటీగా మరో స్టార్ హీరో సూర్య తన సినిమాను సిద్ధం చేస్తున్నట్టు టాక్.కోలీవుడ్ నుండి వస్తున్న భారీ సినిమాల్లో సూర్య42 ఒకటి.డైరెక్టర్ శివ దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

అయితే ఈ రెండు భారీ ప్రాజెక్టులు కూడా ఒకేసారి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది. విజయ్ లియో తో పాటు సూర్య 42వ సినిమా కూడా అక్టోబర్ 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.దీంతో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కు పోటీ ఎలా ఉంటుందో చూడాలి.విజయ్, సూర్యాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.







