తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రెండు తెలుగు రాష్ట్రాలలో బాలయ్య బాబుకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
చిన్న పెద్ద అని తేడా లేకుండా బాలయ్య బాబుకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.బాలయ్య బాబు ఎక్కడికైనా వస్తున్నారు అంటే చాలు అక్కడికి భారీగా అభిమానులు చేరుకుంటూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా బాలయ్య బాబు విజయవాడలో సందడి చేశారు.అఖండ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ తో కలిసి ఒక నగల దుకాణాన్ని ప్రారంభించారు బాలకృష్ణ.

కాగా ఈ జువెలరీ బ్రాండ్ కి ప్రగ్యా జైస్వాల్ అలాగే బాలయ్య బాబు ఇద్దరూ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలోని విజయవాడ బందర్ రోడ్డులో అట్ట హాసంగా జ్యువలరీ షాప్ ని ఓపెన్ చేశారు.బాలయ్య బాబు ప్రగ్యా జైశ్వాల్ నీ చూడడానికి అభిమానులు భారీగా పోటెత్తారు.ఇక బాలయ్య బాబుని చూడడం కోసం వారితో సెల్ఫీలు దిగడం కోసం అభిమానులు ఎగబడ్డారు.
ఇక షో రూమ్ ప్రారంభించిన తర్వాత బాలయ్య బాబు అభిమానులతో కాసేపు ముచ్చటించారు.ఈ క్రమంలోనే బాలయ్య బాబు అభిమానులతో మాట్లాడుతున్న సమయంలో ఒక ముసలి ఆవిడ బాలయ్య బాబు దగ్గరికి వచ్చింది.

ఇక ఆవిడ బాలయ్య బాబు దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుంది.బాలకృష్ణ కూడా ఆమె అభిమానం చూసి ఆప్యాయంగా భుజంపై చేయి వేశారు.దాంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇక అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కిందికి వెళ్ళమని చెప్పగా ఆమె బాలయ్యను వదిలి కిందికి వెళ్ళను అన్నట్లుగా తల ఊపుతూ మారం చేసి ఆ తర్వాత నిదానంగా ఎదిగి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య బాబు నా మజాకా బాలయ్య బాబు అభిమానులకు ఎస్ లిమిట్ లేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.







