మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో వివిధ రంగాలకు చెందినటువంటి పలువురు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో తమ ఎదుగుదలకు కారణమైనటువంటి వారి గురించి ఎమోషనల్ పోస్టులు చేస్తూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు.
ఈ క్రమంలోనే నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈయన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రపంచంలో తమ న్యాయ బద్దమైన స్థానం కోసం పోరాడుతున్న, స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ సెల్యూట్.భవిష్యత్తు తరాలు ముందుకు వెళ్లడానికి మీరు ఊపిరి పోస్తున్నారు.
ఇక నా జీవితంలో అత్యంత ప్రభావితమైన మహిళలు వీళ్లే అంటూ తన తల్లి అంజనమ్మ తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ విధంగా చిరు వీరితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో మెగా అభిమానులు కూడా ఈ పోస్టుకు స్పందిస్తూ.మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిరు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులతో చిరు బిజీగా ఉన్నారు.







