మంచు విష్ణు, మనోజ్ మధ్య ఆ గొడవలు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత?

మంచు మనోజ్ వివాహం భూమా మౌనిక రెడ్డి తో వైభవంగా జరిగింది.ఇద్దరికీ ఇది రెండో వివాహం అనే విషయం కూడా అందరికీ తెలిసిందే.

 What Happen Between Manchu Vishnu And Manchu Manoj , Manchu Vishnu , Manchu Mano-TeluguStop.com

భూమా మౌనిక రెడ్డి యొక్క కొడుకుని తన కొడుకుగా స్వీకరిస్తున్నట్లు మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించి తన యొక్క మంచితనాన్ని కనబరిచాడు.మంచు మనోజ్ తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఆ ఫోటో లో మంచు విష్ణు కనిపించక పోవడంతో రకరకాలుగా విమర్శిస్తున్నారు.వివాహ కార్యక్రమానికి మంచు విష్ణు హాజరయ్యారు, కానీ కార్యక్రమాలన్నింటికీ కూడా అంటి ముట్టనట్లుగా కాస్త దూరంగా ఉంటూ వచ్చారు.

మంచు విష్ణు వివాహం లో యాక్టివ్ గా లేక పోవడం కారణంగా ఇదే అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అన్నదమ్ములు ఇద్దరు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే మనోజ్ పెళ్లి సందర్భంగా విష్ణు ఎడమొహం పెడ మొహం అన్నట్లుగా ఉన్నాడని సోషల్ మీడియా లో ప్రచారం మొదలైంది.అయితే ఆ విషయంలో నిజం లేదని ఇప్పటి వరకు మోహన్ బాబు ఆస్తి కి సంబంధించిన పంపకాలు ఏమీ చేయలేదని, ఇద్దరు కూడా వారి సొంత సంపాదన తోనే జీవితాన్ని హాయిగా సాగిస్తున్నారని మంచు ఫ్యామిలీ కి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు.మంచు ఫ్యామిలీ అంటే గిట్టని వారు కొందరు ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారని విష్ణు పెళ్లి కి హాజరయ్యారని కొన్ని కారణాల వల్ల కాస్త దూరంగా ఉండి ఉంటారు అంతే తప్పితే ఆస్తి తగాదాలు అన్నట్లుగా ఏమి ఉండక పోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి.ఇద్దరు ఒక సారి కలిస్తే పుకార్లన్నింటికి చెక్ పెట్టే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube