హోలీ రోజున శ్రీజ గురించి ఆ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. నెట్టింట్లో వైరల్?

మెగా డాటర్ శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ గురించి మనందరికీ తెలిసిందే.ఇకపోతే గత కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

 Chiranjeevi Daughter Sreeja Husband Kalyan Dev Interesting Social Media Post On-TeluguStop.com

ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలు పై అటు శ్రీజ కాని ఇటు కళ్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు.ప్రస్తుతం భార్య శ్రీజకు దూరంగా ఉంటున్నాడు కళ్యాణ్ దేవ్.

కాగా ఈ జంట విడాకులు తీసుకున్నారని త్వరలోనే విడాకులు తీసుకుని విడిపోబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి.

కళ్యాణ్ దేవ్, శ్రీజ కూతురు నవిష్క ప్రస్తుతం శ్రీజ వద్దే పెరుగుతున్న విషయం తెలిసిందే.

దీంతో అప్పుడప్పుడు కూతుర్ని తలుచుకొని ఎమోషనల్ గా పోస్ట్లు చేస్తూ ఉంటాడు కళ్యాణ్ దేవ్.ఇది ఇలా ఉంటే హోలీ పండుగ సందర్భంగా కళ్యాణ్ దేవ్ సంతోషంగా కనిపించడంతోపాటు అభిమానులకు హోలీ శుభాకాంక్షలు అని తెలిపారు.కళ్యాణ్ దేవ్ హోలీ పండుగ సందర్భంగా చాలా సంతోషంగా కనిపించడంతో ఆయన విడాకుల డిప్రెషన్ నుండి బయటకు వచ్చారని,

అందుకే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే మొన్నటికి మొన్న వాలెంటైన్స్ డే రోజు కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగిన విషయం తెలిసిందే.కళ్యాణ్ దేవ్.ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం.అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు.దానికి కౌంటర్ గా శ్రీజా ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు.

తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి.ప్రేమను గుర్తించాలి.ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు అని శ్రీజా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు.వారిద్దరూ అలా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో వారి మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని వాటిని చూస్తే అర్థమవుతుంది.

ఇకపోతే మొన్నటి వరకు శ్రీజ మూడో వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube