విశాఖ రాజధాని.. జగన్ కు లాభామా ? నష్టమా ?

ఏపీలో మూడు రాజధానుల గోల రోజుకో మలుపు తిరుగుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రస్తావను తెరపైకి తీసుకొచ్చింది.

 If Visakha Is The Capital, Is It An Advantage For Jagan , Jagan, Visakha, Ycp,-TeluguStop.com

అయితే అధికారంలోకి వచ్చి నల్లూగేళ్లు దాటిన ఇప్పటి వరకు మూడు రాజధానులు అమలు కాలేదు.ఈ ప్రతిపాదనపై అడుగడుగున వైసీపీకి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.

అమరావతి కాదని త్రీ క్యాపిటల్స్ కు వైఎస్ జగన్ మొగ్గు చూపడంతో అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.మరోవైపు కోర్టులో ఈ ప్రతిపాదనపై స్టే నడుస్తోంది.

అలాగే ప్రత్యర్థి పార్టీలు కూడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి.

Telugu Ap, Jagan, Uttarandhra, Visakha, Ys Jagan-Latest News - Telugu

ఇదిలా కొనసాగుతుండగా మూడు రాజధానుల అంశాన్ని కాస్త హోల్డ్ లో ఉంచి విశాఖ మాత్రమే రాజధాని అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ.త్వరలో విశాఖ రాజధాని కాబోతుందని, తాము కూడా అక్కడికే షిఫ్ట్ అవుతున్నట్లు సి‌ఎం జగన్ కూడ ప్రకటించారు.దాంతో విశాఖను మాత్రమే రాజధానిగా చేయబోతున్నారా ? అనే డౌట్ అందరిలోనూ కలిగింది.ఇక ఆయా సందర్భాల్లో బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్ వంటి వాళ్ళు కూడా విశాఖ మాత్రమే రాజధాని అని చెబుతున్నారు.కాగా వైసీపీ విశాఖాను మాత్రమే రాజధానిగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ అక్కడ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని, భూ కబ్జాల కోసమే విశాఖన రాజధానిగా ప్రకటించబోతుందని వైసీపీపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

అయితే విశాఖను రాజధానిగా ఎంచుకోవడం వెనుక వైసీపీ భారీ ప్లాన్ వేసిందని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.

Telugu Ap, Jagan, Uttarandhra, Visakha, Ys Jagan-Latest News - Telugu

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకుకు గాలం వేసేందుకే ఆల్రెడీ అభివృద్ది చెందిన వైజాగ్ ను రాజధానిగా ఎంచుకునే ప్రయత్నం చేస్తోదట వైసీపీ.ఇదిలా ఉంచితే విశాఖను రాజధానిగా ప్రకటించడం వల్ల వైసీపీకి కలిగే లాభమెంతా ? అనే దానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.అయితే ఈ అంశంలో వైసీపీకి లాభం కంటే నష్టమే అధికమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే విశాఖను ఎప్పటికిప్పుడు ఎందుకు వైఎస్ జగన్ ఎందుకు రాజధానిగా ప్రకటించబోతున్నారనే దానిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో క్లారిటీ లేదు.అలాగే విశాఖాలో భూ కుంభకోణాల వివాదాలు కూడా వైసీపీ నేతలపై గట్టిగానే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదని కొందరి వాదన.విశాఖను రాజధాని చేయడం వల్ల వైసీపీ మాత్రమే లభ్ది పొందుతుందని, ఉత్తరాంధ్ర ప్రజలు కాదని అభిప్రాయం చాలమందిలో ఉంది.

అందువల్ల విశాఖ రాజధాని అంశం వైసీపీకి లాభం కంటే కూడా నష్టాన్నే ఎక్కువ కలిగిస్తుందని కొందరి వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube