సినిమాలలో కన్నా కొందరు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకొని వార్తల్లో నిలుస్తుంటారు అలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పూనమ్ కౌర్ ఒకరు.మాయాజాలం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె నటించినది చాలా తక్కువ సినిమాలలో ఆయనప్పటికీ సోషల్ మీడియా వార్తల ద్వారా మాత్రం బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఈమె కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.

ఇలా అన్ని విషయాల గురించి స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈమె తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ కేవలం తన మతం కారణంగా తనని వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను తెలంగాణలోని పుట్టి పెరిగాను కానీ నన్ను పంజాబీ, సిక్కు అని మతం పేరుతో తనని దూరం చేస్తున్నారని ఈమె ఆవేదన చెందారు.

మతం పేరుతో నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి.నేను మీ బిడ్డనే నన్ను వేరు చేయకండి అంటూ వేదికపై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో పై పలువురు నెటిజన్స్ యధావిధిగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాల విషయానికొస్తే హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఎక్కువగా హీరో చెల్లెలు పాత్రలలోను హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటించారు.
అయితే సినిమాల ద్వారా ఈమెకు ఎలాంటి గుర్తింపు రాలేదని చెప్పాలి.సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.







