అనుమానమే భార్యను ఆరు ముక్కలు చేసిందా.. కసాయి భర్త కిరాతకం..!

అనుమానం అనేది వైరస్ కంటే దారుణంగా తయారయింది.అనుమానం వస్తే కుటుంబాలు నాశనమై రోడ్డున పడాల్సిందే.

 Suspicion Cut His Wife Into Six Pieces , Six Pieces, Cut His Wife, Bilaspur In-TeluguStop.com

అనుమాన కారణంగా భార్య ఆరు ముక్కలై, దారుణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఛత్తీస్ గడ్ లోని బిలాస్పుర్ లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిలాస్పూర్ లోని ఇస్లాపూర్ లో రెండు నెలల క్రితం జరిగిన హత్య, దుర్వాసన కారణంగా ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

పోలీసులకు సమాచారం అందించడంతో, సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేస్తే వెలుగులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.మృతురాలి భర్త పవన్ సింగ్ ఠాకూర్, తన భార్యపై అనుమానంతో చంపి, శరీర భాగాలను ఆరు ముక్కలు చేసి, టేపులతో చుట్టి ఇంట్లోనే సింటెక్స్ ట్యాంక్స్ లో దాచి పెట్టాడు.

తనకేం తెలియనట్టు మామూలుగా ఉండసాగాడు.కానీ శరీర భాగాలు కుళ్ళి దుర్వాసన రావడంతో విషయం బట్టబయలు అయింది.

Telugu Latest Telugu, Syntex Tank-Latest News - Telugu

సింటెక్స్ ట్యాంకులో శరీర భాగాలను చూసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ అయ్యారు.భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందేమో అనే అనుమానంతోనే ఠాకూర్ ఈ దారుణం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని ఠాకూర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెరుగుతూ, నేరాల సంఖ్య అధికంగా పెరగడంతో రోడ్లపై పడే కుటుంబాల సంఖ్య క్రమేణా పెరుగుతూ పోతోంది.

అచ్చం ఇలాంటి సంఘటన బీహార్లో జరిగి భర్త కటకటాల పాలయ్యాడు.ఓ వివాహిత పక్కింటి యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ సంబంధం కొనసాగించింది.కానీ ఈ విషయం గ్రామస్తుల ద్వారా భర్తకు తెలియడంతో క్షణికావేశంలో భార్యను చంపేసి తన మేనల్లుడు సహాయంతో గ్రామ సమీపంలో పడేసి, చేతులు దులుపుకుందామనుకుంటే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.విచారణలో తానే స్వయంగా భార్యను చంపినట్లు అంగీకరించాడు.

అక్రమ సంబంధం అనేది ఏదో ఓ రోజు బయటపడి జీవితాలను నాశనం చేసేంతవరకు వదిలిపెట్టదు.జీవితాన్ని కటకటాల పాలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube