ఈమధ్య సీరియల్ ఆర్టిస్టులు కూడా తమ అందాలతో బాగా కనువిందు చేస్తున్నారు.తాము కూడా ఏం తక్కువ కాదు అన్నట్లుగా అందాల విందు వడ్డిస్తున్నారు.
పొట్టి పొట్టి బట్టలు వేయకుండా ఓ మోతాదు బట్టలు వేసినప్పటికీ కూడా మంచి అందాలను బయటపెడుతూ ఉన్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా కార్తీకదీపం సీరియల్ ఆర్టిస్ట్ శోభా శెట్టి కూడా తన లేలేత అందాలతో మతి పోగొట్టింది.
కార్తీకదీపం సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.ఆ సీరియల్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది.
చేసిన క్యారెక్టర్ విలన్ అయినప్పటికీ కూడా మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక ఈ సీరియల్ ముగిసినప్పటికీ కూడా ఈమెను మాత్రం తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేక పోతున్నారు.

ఇక ఆ సీరియల్ తో దూరం ఉన్న కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈమె అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడకు చెందిన నటి.ఈమె కన్నడ, తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.కార్తీకదీపం సీరియల్ తోనే మంచి సక్సెస్ అందుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.

అందులో తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.కార్తీక దీపం సెట్ లో చాలా వీడియోలను తీసి అభిమానులకు పంచుకుంది. ఈమె ఫోటోలను రీ పోస్ట్ చేసే ఫ్యాన్స్ కూడా చాలానే ఉన్నారు.
నిజానికి ఈమె ఫోటోలు పంచుకుంటే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక మంచి ఫిజిక్ ఉన్నప్పటికీ కూడా మరింత అందంగా కనిపించడానికి బాగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.

తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలు బాగా పంచుకుంటుంది.ఇక ఈ బ్యూటీ ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఎప్పుడు కూడా అతిగా గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ షూట్ లు చేయించుకొని వాటిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
అందులో ఈ బ్యూటీ అందమైన చీర కట్టుకొని తన అందాలతో బాగా ఫిదా చేసింది.ఏకంగా బ్యాక్ అందాలు చూపిస్తూ.
తెగ ఆకట్టుకుంది.అచ్చం మోనిత లుక్ లో కనిపిస్తూ మళ్ళీ కార్తీకదీపం సీరియల్ పాత్రలాగా అనిపించింది.
ఈ బ్యూటీ మేకప్ వేసుకోకున్న కూడా చాలా అందంగా ఉంటుంది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా.
తన అందాలను చూసి అభిమానులు చీర అందాలు మామూలుగా లేవు కదా అంటూ ఫిదా అవుతున్నారు.ఇక ఈమె ప్రస్తుతం మరో సీరియల్ లో బిజీగా ఉండగా అప్పుడప్పుడు కొన్ని వీడియో ఆల్బమ్స్ చేస్తూ కనిపిస్తుంది.







