మీరు రూ. 10వేల లోపు ఫోన్ కొనాలని చూసున్నారా? ఇవి ట్రై చేయండి!

ఇపుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది తప్పని సరి అయింది.ఎందుకంటే ఇపుడు ప్రతీది దానితో లింక్ చేయబడి ఉంటోంది గనుక.

 You Will Pay Rs. Looking To Buy A Phone Under 10k Try These, 10 Thousand, Below,-TeluguStop.com

సమాచారానికి, షాపింగ్ కి, చాటింగ్ కి, బ్యాంకింగ్ కి… ఇలా అన్నిటికీ మనకి స్మార్ట్ ఫోన్ అనేది కావాల్సిందే.అయితే మనలో దాదాపుగా అందరు మధ్య తరగతివారే కనుక… ఎక్కువ మొత్తం పెట్టి స్మార్ట్ ఫోన్ కొనలేని పరిస్థితి.

అందుకే మీరు అనువైన బడ్జెట్ లో తక్కువ ఫీచర్లున్న ఫోన్ కావాలని భావిస్తే… ఇక్కడ ఇవ్వబడిన మోడల్స్ లో ఏదన్నా ఒకదానిని ఎంచుకోండి.

ఈ లిస్టులో ముందుగా “రెడ్ మీ 10” అనేది మీకు అందుబాటు ధరలలోనే ఉంటుంది.ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.9,999 ధరకు కి ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.దీనిలో 6.7′ అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంటుంది.గొరిల్లా గ్లాస్ 3 ప్రోటెక్షన్ ఉంది.

ఇది స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.దీని తరువాత చెప్పుకోదగ్గది “పోకో C55.” ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కేవలం రూ.9,999 ధరకే అందుబాటులో ఉంది.ఇది మీడియా టెక్ హీలియో జీ85 చిప్‌సెట్‌తో 6.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఆ తరువాత మీరు “రెడ్ మీ A1ప్లస్” ఒకదానిని ట్రై చేయొచ్చు.ఇది కేవలం రూ.7,499 ధరకే అందుబాటులో ఉంది.ఫీచర్ల ఈవిషయానికొస్తే 6.52 అంగుళాల డిస్ప్లే ఉంటుంది.ఇది మీడియా టెక్ హీలియో ఏ22 ద్వారా పనిచేస్తుంది.ఆ తరువాత “మోటో E32” స్మార్ట్ ఫోన్ చూడొచ్చు.ఇది మార్కెట్లో రూ.9,499 ధర వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఇది 6.5 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.చివరగా “లావా బ్లేజ్ 5G” స్మార్ట్ ఫోన్ ట్రై చేయండి.ఇది రూ.10,000 లలో లభించే బెస్ట్ ఫోన్.ఎందుకంటే మీకు సరసమైన ధరలో 5జీతో అనేక అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది.దీని ధర 10,999.మిగిలిన వివరాలకు సంబంధిత సైట్స్ దర్శించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube