'మామ మశ్చీంద్ర' నుండి మూడో లుక్.. 'డీజే'గా సుధీర్ బాబు!

టాలీవుడ్ లో యంగ్ అండ్ డెడికేషన్ ఉన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.ఈయన ముందు నుండి సినిమాల్లో తన డెడికేషన్ చూపిస్తూనే ఉన్నాడు.

 Sudheer Babu's Maama Mascheendra 3rd Look To Be Out, Sudheer Babu, Maama Maschee-TeluguStop.com

సినిమాల మీద ఉన్న పాషన్ కారణంగా సుధీర్ సినిమా లోకి వచ్చి నైట్రో స్టార్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.సుధీర్ బాబు మహేష్ బాబు బావగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోయిన రెండవ సినిమాతోనే మంచి హిట్ అందుకుని హీరో మెటీరియల్ అనిపించాడు.ఒక్కో సినిమా చేస్తూ ప్రెజెంట్ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రజెంట్ సుధీర్ బాబు నటిస్తున్న సినిమాల్లో ”మామ మశ్చీంద్ర” ఒకటి.ఈ సినిమాను ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి టైటిల్ విషయం లోనే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది.ఇక తాజాగా సుధీర్ బాబు కు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో సుధీర్ మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తుండగా.ఇప్పటికే దుర్గ అనే రోల్ కు అలాగే రెండవ రోల్ పరశురామ్ రోల్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేసారు.

ఇక ఇప్పుడు మూడవ రోల్ కు సంబందించిన డీజే పాత్రని పరిచయం చేసారు.ఇందులో సుధీర్ మంచి స్టైలిష్ లుక్ లో అయితే కనిపిస్తున్నాడు.ఇలా ఫైనల్ గా మూడు పాత్రలను అయితే రివీల్ చేసారు మేకర్స్.మరి రిలీజ్ తర్వాత సుధీర్ మూడు రోల్స్ లో ఎలా ఆకట్టు కుంటాడో వేచి చూడాలి.

ఇక శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ పి వారు నిర్మిస్తుండగా.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube