హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదు.

 Holi Should Be Celebrated In A Peaceful Atmosphere Ellareddypet Si Shekar, Holi-TeluguStop.com

ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునని, హోలీ పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయబడును ఇందుకు వాహనదారులందరూ పోలీస్ వారికి సహకరించాలన్నారు .


హాస్పిటల్ , దేవాలయాలు, చర్చి మసీదులు, మొదలైన ప్రాంతాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం.కావున రేపు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అలా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.


హోలీ అనంతరం పిల్లలు, యువకులు స్నానం చేయడానికి చెరువులు, బావుల వద్దకు వెళుతుంటారు, తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోగలరని తెలిపారు.హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలు మా పోలీస్ వారికి పూర్తిగా సహకరించగలరని ఓ ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube