మనిషి జీవితం అంతే … అందరూ టాప్ లోనే ఉంటేనే ఇష్టపడతారు.చదువులో టాప్ గా ఉండాలి, అందంలో టాప్ గా ఉండాలి, డబ్బు సంపాదనలో టాప్ గా ఉండాలి, ఇలా అన్ని విషయాలు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
టాప్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ ఎవరైనా ఏదైనా సాధిస్తే ఆ గెలుపును కూడా మనం ఓన్ చేసుకుంటాం ఉదాహరణకి ఎవరైనా ఏ ఆటలోనైనా బంగారు పతకం సాధిస్తే అతడిని మనవాడిగా చెప్పుకుంటాం.రోజు అతడితో నేను ప్రాక్టీస్ చేసేవాడిని, ప్రాక్టీస్ కి వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చేవాడిని అంటూ కాకరకాయ కాబుర్లు చెబుతూ ఉంటాం.

ఇక సినిమా హీరోల విషయంలో కూడా అచ్చు ఇలాగే జరుగుతుంది ఎందుకంటే హీరో అన్నిట్లో నెంబర్ వన్ గా ఉంటాడు నలుగురిని కొడతాడు కావలసింది చేస్తుంటాడు అమ్మాయిని పడేస్తాడు అందుకే అతనికి హీరోయిజం అనే ఒక బ్రాండ్ తగిలించేస్తాం.దాన్నే హీరోయిజం అని అనుకుంటూ ఉంటాం.ఆ హీరోయిజాన్ని ఫాలో అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం.దర్శకులు కూడా ఏం తక్కువ తినలేదు.జనాలకు ఏం కావాలో, ఎలా నచ్చుతారో అదే విధంగా తన సినిమాలో హీరోని తేచిదిద్దుతూ ఉంటాడు.హీరో లాగా మనం కూడా ఇమిటేట్ చేయాలని భావిస్తాం అమ్మాయిలను పడగొట్టాలని, బ్రాండ్ బట్టలు వేసుకోవాలని, అందంగా కనిపించాలని ఉబలాట పడిపోతూ ఉంటారు.

ఇందుకు గల మెయిన్ కారణం ఏంటి అంటే సక్సెస్ కావాలి అని ఒక ప్రెషర్ మన పైన ఎప్పుడు ఉంటుంది.ఆ ప్రెషర్ తట్టుకోలేము కానీ ఎవరైనా సక్సెస్ అయితే అది మనకు బాగా నచ్చుతుంది.మన జీవితంలో సాధించలేని ఎన్నో విషయాలను పలానా హీరో సాధిస్తున్నాడు కాబట్టి ఆ హీరో బాగా మనకు నచ్చేస్తాడు.దాంతో మనలోని అహానికి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది.
దాంతో ఆ హీరో మన ఆరాధ్య దైవంగా మారిపోతాడు.ఇక ఇంట్లో కూడా పక్కవారితో పోల్చడం బాగా అలవాటు కాబట్టి మనం ఆ కంపారిజన్ ప్రెషర్ లో చాలా విషయాలను అధిగమించలేక ఇబ్బంది పడుతూ ఉంటాం.
అందుకే రీల్ హీరోలను ఆరాధిస్తూ రియల్ హీరోలం మనమే అన్న విషయాన్ని మర్చిపోతాము.







