ఒకప్పుడు ఒక సినిమా వచ్చిందంటే అది ఆ భాషలోనే సక్సెస్ సాధించేది దానికి సంభందించిన హీరోలకి కూడా ఆ భాషలోనే మంచి పేరు వచ్చేది వాళ్ల మార్కెట్ కూడా అక్కడికే పరిమితం అయ్యేది.కానీ ఇప్పుడు సినిమా లెక్కలు అన్నిమారిపోయాయి.
ఇప్పుడు ఒక సినిమా నచ్చింది అంటే చాలు ఆ సినిమా దేశం మొత్తం చూస్తున్నారు అందులో నటించిన నటి నటులకి దేశవ్యాప్తం గా మంచి పేరు వస్తుంది.ఇప్పటికే రామ్ చరణ్ ప్రభాస్ ఎన్టీయార్ అల్లు అర్జున్ యష్ లాంటి హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా స్టార్లు గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే వీళ్లు కాకుండా పాన్ ఇండియా రేంజ్ స్టార్ డాం సాధించిన కుర్ర హీరోలు ఎవరనేది ఒకేసారి చూద్దాం…
ముందు గా ఈ లిస్ట్ లో మనం మాట్లాడుకునే హీరో దుల్కర్ సల్మాన్ ఈయన భాషలతో సంభందం లేకుండా మంచి సినిమాలు చేస్తూ మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
దాదాపు ఆయన అన్ని భాషల్లో సినిమాలు చేసి నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఆయన దేశం లోని ఏ భాషలో అయినా స్ట్రెయిట్ గా సినిమా చేయగలడు.లాస్ట్ ఇయర్ తెలుగు లో సీత రామం సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు…

ఒకే ఒక సినిమా అయిన కాంతారా సినిమాతో దేశం మొత్తం పాపులారిటీ సంపాదించుకున్న హీరో రిషబ్ శెట్టి ఈయన తీసిన చిన్న సినిమా అన్ని భాషల్లో అంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరు ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదు కానీ ఈ సినిమా దాదాపు 200 కోట్ల వరకు కలెక్ట్ చేసి భారీ హిట్ గా నిలిచింది…

ఇక ఆ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ హీరోగా చేసిన కార్తికేయ 2 సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమా హిందీ లో ఎవ్వరు ఊహించని విధంగా పెద్ద విజయాన్ని అందుకుంది.దాంతో నిఖిల్ కూడా పాన్ ఇండియా హీరో గా మంచి గుర్తింపు పొందాడు.ఈ సినిమా కూడా దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టిందనే చెప్పాలి…
.







