ప్రస్తుతం సమాజంలో రకరకాల దారుణాలు, మోసాలను చూస్తూనే ఉన్నాం.టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాటిలో చూస్తూ కొత్తరక దారుణాలకు పాల్పడుతున్నారు.
చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా చూడొచ్చు.యూట్యూబ్ అనేది ఎంటర్టైన్మెంట్ తో పాటు, కావలసిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ ఫామ్.
అయితే కొందరు చెడు పనుల కోసం యూట్యూబ్ లలోని వీడియోలు చూస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.మహారాష్ట్ర నాగపూర్ లోని అంబాజారి ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చి ఇంట్లో ఎవరికి తెలియకుండా యూట్యూబ్ చూసి, సొంతంగా డెలివరీ చేసుకుని ఆ పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది.
ఈ విషయం బయటపడడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది.9వ తరగతి చదువుతున్న బాలికకు ఇంస్టాగ్రామ్ లో ఏక్ ఠాగూర్ అనే ఒకడు పరిచయమయ్యాడు.కొంతకాలం చాటింగ్ చేసుకున్న తర్వాత 9 నెలలకు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం ప్రారంభించారు.ఠాగూర్ అవకాశం కోసం ఎదురు చూస్తూ బాలికను తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాపించి ఆమెపై అత్యాచారం చేశాడు.
బాలిక గర్భం దాల్చింది.ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి, తనకు అనారోగ్యం ఉందని కుటుంబ సభ్యులను నమ్మించింది.
ఈనెల రెండవ తేదీన ఇంట్లో కుటుంబ సభ్యులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో, బాలికకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.యూట్యూబ్ లో ప్రసవం ఎలా చేయాలో చూసి సొంతంగా తానే ప్రసవం చేసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపి, ఇంట్లోని ఓ డబ్బా లో దాచిపెటింది.ఇంటికి వచ్చిన తల్లికి రక్తపు మరగలు, బాలిక నీరసంగా కనిపించడంతో హాస్పటల్ కు తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది.
ప్రస్తుతం వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.