ఈ మధ్య కాలంలో టీవీ ఛానెళ్లలోని ప్రోమోలు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాయి.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ప్రోమోలో ఇమ్మాన్యుయేల్ చనిపోతే వర్ష ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చేసి చూపించాలని రష్మీ కోరారు.
ఇమ్మాన్యుయేల్ చనిపోయినట్టు యాక్ట్ చేయగా వర్ష ఇమ్ము ఇమ్ము అంటూ తెగ ఏడ్చేశారు.ఎవరైనా ఉన్నారా అంటూ వర్ష కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఎమోషనల్ అయ్యారు.
అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మాత్రం రేటింగ్స్ కోసం టీవీ షోల నిర్వాహకులు ఎంతకైనా తెగిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్టు చూపించడం అంటే అతికి పరాకాష్ట అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్ష ఇమ్మాన్యుయేల్ మధ్య రియల్ లైఫ్ లో ఏం లేకపోయినా వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా ప్రోమోలను క్రియేట్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

రేటింగ్స్ కోసం రియాలిటీ షోల నిర్వాహకులు ఏమైనా చేస్తారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీదేవి డ్రామా కంపెనీ షోపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాస్క్ లు ఇచ్చే డైరెక్టర్లు అవి ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చేలా ఉండాలని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
ఇకపై అయినా ఇలాంటివి రిపీట్ కాకుండా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తారేమో చూడాలి.

ఈ తరహా టీఆర్పీ స్టంట్స్ వల్ల టీవీ షోలపై వెగటు పుడుతోందని మరి కొందరు చెబుతున్నారు.డైరెక్టర్లకు ఎలాగో తెలివి లేదని ఇమ్మాన్యుయేల్ వర్ష తెలివి ఏమైందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇమ్మాన్యుయేల్ వర్షలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈ తరహా పబ్లిసిటీ స్టంట్స్ వల్ల వీళ్లను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్లపై ఇమ్మాన్యుయేల్ వర్ష ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.








