యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అంటూ ఇన్ని రోజులు పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చలు జరిగాయి.అయితే ఒక్క పోస్టర్ తో ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ జాన్వీ కపూర్ అంటూ అధికారకంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈ విషయం గురించి నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు.ఎట్టకేలకు ఇది జరుగుతుంది నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ తో కలిసి సందడి చేయడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇలా ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించబోతున్నారు అని తెలియడంతో ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానుల సైతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మనవడు తారక్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే శ్రీదేవి కల కూడా నెరవేరుతుంది అంటూ శ్రీదేవి అభిమానులు ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీదేవి చనిపోక ముందు ఓ సందర్భంలో ఎన్టీఆర్ తోమాట్లాడిన శ్రీదేవి తన కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అది నీ సినిమాతోనే అడుగు పెట్టాలని కోరుకున్నారట.ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా శ్రీదేవి చనిపోయిన తర్వాత తెలియచేశారు.మీ తాత నేను కలిసి ఎన్నో సినిమాలలో నటించాం.మా ఇద్దరి జోడికి మంచి ఆదరణ ఉంది అలాగే మీ జోడికి కూడా మంచి పేరు రావాలని ఆమె చెప్పారట.
ఇలా అప్పట్లో శ్రీదేవి చెప్పిన విధంగానే తన కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ జోడిగా అడుగుపెట్టడంతో శ్రీదేవి కల కూడా నెరవేరింది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.