చరణ్ తో పనిచేయడం గురించి లవ్లీ కామెంట్ చేసిన కియరా... ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా అమెరికాలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఈయన కొంతకాలం పాటు తన సినిమా షూటింగ్ పనులకు విరామం ప్రకటించారు.

 Kiara Made A Lovely Comment About Working With Charan What Do You Think , Kiara-TeluguStop.com

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శర వేగంగా జరుపుకుంటున్నారు.

ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటి కియారా అద్వానీ నటిస్తున్నారు.

ఇక ఇటీవల కియారా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్లి చేసుకోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగుకు విరామం ప్రకటించారు.అయితే త్వరలోనే ఈమె తిరిగి RC15 షూటింగ్లో పాల్గొనబోతున్నారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ… గతంలో తాను రాంచరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించానని తెలిపారు.

ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ లవ్లీ గానే ఉంటుందని ఈమె తెలిపారు.

రామ్ చరణ్ మంచి నటుడు మాత్రమే కాదని అతనిలో గొప్ప డాన్సర్ కూడా ఉన్నారని ఈ సందర్భంగా కియారా రామ్ చరణ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక RC 15 సినిమాలో తనతో పాటు రామ్ చరణ్ ను కూడా కొత్తగా చూడబోతున్నారని ఈమె తెలియజేశారు.ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా శంకర్ ఇండియన్ 2సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి కాస్త విరామం ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube